Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ మొండిపోర గ్రామానికి చెందిన జగడం నానిబాబు తాటాకిళ్ళు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయి నిరాశ్రయులైన ఆ కుటుంబానికి కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయులు,ఇతర ఉపాధ్యాయులు 22,300రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు.అలాగే ఆ స్కూల్ లో చదివే నాని బాబు కుమార్తె కు కొత్త సైకిల్ ను కొని ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయు రాలు రేకపల్లి అంబ, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ,ఎం. పేరి శెట్టి, కె. పల్లారావు, ఎన్. శ్రీను బాబు, ఎం. శ్రీరామ మూర్తి, కె. లక్ష్మణరావు, ఎం. ఎస్. ఎన్. రాజు, పి. జగన్నాధరావు, చింతా రాంబాబు, ఈ. పెద్ది రాజు, జె. శ్రీనివాసరావు, సాయిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.