(జనం న్యూస్ చంటి జనవరి 1)
సూరంపల్లి, దౌల్తాబాద్ మండలం:సూరంపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గంగాధరి స్వప్న స్వామి నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదాలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు.గ్రామంలోని అన్నదమ్ములు, యువత, అక్కచెల్లెళ్లు, పెద్దలు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఐక్యతతో కలిసికట్టుగా ఉంటేనే గ్రామం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.యువత గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై మంచి మార్గంలో నడవాలని ఆమె సూచించారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటానని గంగాధరి స్వప్న స్వామి హామీ ఇచ్చారు.నూతన సంవత్సరంలో సూరంపల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు.


