(జనం న్యూస్ చంటి 01) దౌల్తాబాద్ జనవరి
మండలం సూరంపల్లి గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తలారి నర్సింహులు గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మరియు సమస్త గ్రామ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సంవత్సరం గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలబడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.అలాగే యువత చదువు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టాలని, గ్రామంలో ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.కొత్త సంవత్సరం ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


