జనం న్యూస్ డిసెంబర్ 31: నిజామాబాద్ జిల్లా
భీంగల్ మండలంలోని పల్లికొండ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన గొల్లపిండి మనీష్ అశోక్‌ను, 5వ వార్డు మెంబర్‌గా ఎన్నికైన యువ నాయకుడు దొన్కంటి రాజేష్‌ను భీంగల్ యూత్ కాంగ్రెస్ క్రియాశీల కార్యవర్గ సభ్యులు రేగుళ్ల అరుణ్ కుమార్, కంకణాల వంశీకృష్ణ బుధవారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొల్లపిండి మనీష్ అశోక్, 5వ వార్డు మెంబర్ దొన్కంటి రాజేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్లికొండ శివతో పాటు భీంగల్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


