తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 డిసెంబర్
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో జరిగిన అనేక కీలక పరిణామాలు ఉద్యమకారుల త్యాగాలు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం ఓంకార్ మడివాల్ తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను గుర్తుచేస్తూ రాష్ట్ర సాధనకు కెసిఆర్ నాయకత్వం చరిత్రాత్మకమని కొనియాడారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కెసిఆర్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు ఈ భేటీ సందర్భంగా కెసిఆర్ కూడా ఉద్యమకారుల సేవలను గుర్తు చేస్తూ వారి త్యాగాల వల్లనే తెలంగాణ సాధ్యమైందని అభినందించారు భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది


