Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 31 వికారాబాద్ జిల్లా

పరిగి :- శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని 52 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ఒకటవ తరగతి నుండి ఎనామిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ రెండో దశ ఎఫ్ ఎల్ ఎన్ పుస్తకాలను అందించడం జరిగింది. ముందుగా పరిగి మండలంలోని నస్కల్ ప్రథమిక పాఠశాల విద్యార్థులకు గెజిటెడ్ హెడ్మాస్టర్ ఎం. అంజిలయ్య సార్ చేతులమీదుగా విద్యార్థులకు అందించడం జరిగింది. శిక్షణ ఫౌండేషన్ వారు విద్యార్థుల లోపల బేసిక్స్ లెవల్స్ ను పెంచాలనే ఉద్దేశంతో ఎఫ్ఎల్ఎన్ పుస్తకాలను మరియు స్టెమ్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందని వాటిని విద్యార్థులు తప్పకుండా రాసి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. శిక్షణ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయని అవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా ఎం. అంజిలయ్య సార్ చెప్పడం జరిగింది. శిక్షణ ఫౌండేషన్ మెంటర్ రమేష్ మాట్లాడుతూ శిక్షణ పౌండేషన్ వారు ఇచ్చే ఎఫ్ ఎల్ ఎన్ పుస్తకాలను విద్యార్థులు చాలా చక్కగా ఉపయోగిస్తున్నారని వాటి ద్వారా విద్యార్థులలో ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు పెరుగుతున్నాయని కావున తప్పకుండా ఈ పుస్తకాలను విద్యార్థులు రాయడం చదవడం నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఇంటిదగ్గర ఏర్పాటు చేసినటువంటి లెర్నింగ్ కార్నర్స్ లో విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా కూర్చొని ఈ పుస్తకాలను రాయాల్సిందిగా చెప్పడం జరిగింది.