Listen to this article

బిచ్కుంద డిసెంబర్ 31 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ యువ నాయకుడు సాయి కుమార్ బుధవారం రోజు
జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో
భారత రాష్ట్ర సమితి పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు అని,ప్రజల కోసం అంకితభావంతో పని చేసే యువ నాయకులు BRS పార్టీలో చేరడం పార్టీని మరింత బలపరుస్తుందని అన్నారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అమలైన పథకాలు,తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన BRS పాలనకు ఆకర్షితులై సాయి కుమార్ పార్టీ లో చేరడం హర్షణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన విభాగం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని సాయి కుమార్ కు ఘన స్వాగతం పలికారు.బిచ్కుంద పట్టణంలో BRS పార్టీ బలోపేతానికి ఇది మరొక కీలక ముందడుగు.