Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 2

ప్రజాశక్తి 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తర్లుపాడు మండల జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశీరావు చేతుల మీదుగా మార్కాపురంలోని ఇమ్మడి కాశీనాథ్ నివాసంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇమ్మడి మాట్లాడుతూ ప్రజాశక్తి రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ ఎంత ఆకర్షణీయంగా, అద్భుతంగా రూపొందిందని ప్రశంసించారు. ప్రజలలో అవగాహన కల్పించడంలో, సమాజ రైతు కార్యక్రమాలకు దోహదపడేలా క్యాలెండర్ ఉండటం అభినందనీయమన్నారు. ప్రజాశక్తి పత్రిక ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం వార్త కథనాలు రాస్తుందని కొనియాడారు. నిజాలను నిర్భయంగా రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని తెలిపారు. సామాన్యులను ఆలోచింపజేసి ప్రజలను చైతన్య పరుస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కాపునాడు అధ్యక్షురాలు సిద్ధం కృష్ణవేణి, ఎస్ఎంసి చైర్మన్ వెన్న రాజారామిరెడ్డి,కొండెబోయిన సునీల్, గుంటు మోషే, గంజర బోయిన మహేష్, చీకటి శివకాశి,బాలరాజు, మువ్వ సురేష్, పఠాన్ కరీముల్లా, నంద్యాల సాహెబ్ మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఆవిష్కరించారు.