జనం న్యూస్ 02 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా సిబ్బంది అంతా ఒక కుటుంబంలా బాధ్యతతో పనిచేయాలి : జిల్లా ఎస్పీజోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ — సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, సిరిసంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.పబ్లిక్‌కు జవాబుదారీతనంతో వ్యవహరించడం పోలీస్ బాధ్యత అని, సీనియర్ అధికారులుగా ప్రజల అంచనాలను అందుకునేలా నడుచుకోవాలని సూచించారు. సమాజంలో మంచి–చెడ్డవాళ్లు ఉన్నప్పటికీ, నిర్దోషులను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు సిబ్బంది అందరూ సహకరించారని తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా టీం వర్క్‌తో, ఒక కుటుంబంలా ఐక్యతతో, కమిట్‌మెంట్‌తో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల్ డిఎస్పీ వై. మొగులయ్య, ఏఆర్ డిఎస్పీ నరేందర్ రావు, ఏవో సతీష్ కుమార్, ఆర్‌ఐలు వెంకట్, హరీష్, గద్వాల్ – అల్లంపూర్ – శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టంగుటూరి శ్రీను, రవిబాబు, టాటా బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి, భరోసా ఎస్సై తారక, ఐటీ సెల్, సైబర్, డి సి ఆర్ బి, స్పెషల్ బ్రాంచ్, క్లూస్ టీమ్ తదితర విభాగాల అధికారులు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


