నట్టల నివారణ మందుల ను సద్వినియోగం చేసుకోవాలి: -సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు లపంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని పిఏపల్లి సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి, మండల పశు వైద్యాధికారి మహేందర్ రెడ్డి అన్నారు.శుక్ర వారం నాడు మండలం కేంద్రంలో సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పశువైద్య సిబ్బంది కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 2600 జీవాలకు ఉచితంగా నట్టాల నివారణ మందులను వేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కి వైద్య సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్టేబోయిన వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి అక్షిత, పశువైద్య సిబ్బంది రజిత, సురేష్ నాయక్,వార్డు సభ్యులు గంజి సైదులు, ధర్మపురం బిక్షమయ్య, బొల్లి గోర్ల రాధిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.


