జూరాలకు పరవళ్ళు తొక్కుతూ కృష్ణమ్మ.. ప్రారంభమైన వరద ప్రవాహం
జనం న్యూస్ 26 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : నారాయణపూర్ నుంచి జూరాలకు చేరుకున్న కృష్ణజలాలు ప్రస్తుతం 3,227 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జూరాల ప్రాజెక్ట్ :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక జూరాల ప్రాజెక్టుకు వరద కదలిక మొదలైంది. ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వదిలిన వరద నీరు నేడు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ప్రస్తుతం జూరాలకు 3,227 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే ప్రవాహం కనుక కొనసాగితే జూరాల ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలు:పూర్తి స్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం: 316.09 మీటర్లుగరిష్ట నీటి నిల్వ సామర్థ్యం: 9.657 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 5.318 టీఎంసీలు
జర్నలిస్ట్ రాఘవ బంగారు