Listen to this article

జనం న్యూస్ 02 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్


ఎర్రవల్లి,ఇటిక్యాల ప్రాంతాల్లో సంపత్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు.పెద్దదిన్నె గ్రామంలో వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకుని జరుగుతున్న వేడుకలకు దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈరోజు ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామానికి విచ్చేసి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సంపత్ కుమార్ దర్శించుకోవడం జరిగింది మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కి దేవాలయ పురోహితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలుకగా దేవాలయ కమిటీ సభ్యులు పూలమాలలు శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ఆ గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ అభ్యర్థులను సంపత్ కుమార్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ నీలి శ్రీనివాస్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప,ఇటిక్యాల మండల స్థాయి నాయకులు మరియు పెద్దదిన్నె గ్రామ సర్పంచ్ సుజాత మద్దిలేటి ఉప సర్పంచ్ ,,మండల అద్యక్షులు రుక్మానంద రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయచంద్ర రెడ్డి స్వాములు, సోమిరెడ్డి, నర్సిరెడ్డి శ్రీనాథ్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.