Listen to this article

జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో పట్టాదారుల పాసుపుస్తకం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరకు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు దొడ్డి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, సర్పంచ్ దొడ్డి సూరి అప్పారావు, ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్, దాడి ముసలి నాయుడు, మొల్లేటి సత్యనారాయణ, పిఏసిఎస్ అధ్యక్షులు పెంటకోట నర్సింగరావు, ఎల్లపు భాస్కరరావు కే చంద్రమోహన్, పాల సంఘం అధ్యక్షులు కాండ్రేగుల నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు పెంటకోట రాము,క్లస్టర్ ఇంచార్జ్ కాండ్రేగుల శంకర్, ఎల్లపు శ్రావణ్, పెంటకోట అశోక్, కోడెల నూకరాజు, కర్రీ పరుశురాం, కర్రీ శేఖర్, కూటమి కార్యకర్తలు ప్రభుత్వాధికారులు తదితరులు పాల్గొన్నారు.//