Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హై స్కూల్ సెంటర్ నుంచి గోకుల సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల యజమానులకు అవగాహనా కల్పించే ప్రక్రియ చేపట్టారు అమలాపురం పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి వివరిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ఆక్రమణలను తొలగించవలసిందిగా , షాపు యజమానులు వాలంటరీగా ఆక్రమణలను తీసివేసి అంతరాయం లేని ట్రాఫిక్కు సహకరించవలసిందిగా పోలీస్ విజ్ఞప్తి చేసారు. అలా చేయకపోతే ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిలో అమలాపురం పట్టణ సీఐ పీ వీరబాబు ఎస్ఐలు జోషి ,ఏసుబాబు లో పాల్గొన్నారు.