Listen to this article

విఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు

జనం న్యూస్- జనవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నాయకుని జన్మదినాన్ని పురస్కరించుకొని వి ఆర్ ఎస్ యూత్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి కర్నాటి లింగారెడ్డి, హలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, రాజా ప్రసాద్(వైన్స్) ముఖ్యఅతిథు లుగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి టోర్నమెంట్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. కుందూరు రఘువీర్ రెడ్డి ప్రజాసేవా దృక్పథాన్ని గుర్తుచేస్తూ, ఆయన జన్మదినోత్సవాన్ని క్రీడా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్‌లో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్ అంతటా క్రీడాస్ఫూర్తి, స్నేహభావం, ఐక్యత ఉట్టిపడేలా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్ల రామకృష్ణ, వెంకటేశ్వర్లు, ఈర్ల రాంబాబు, రామకృష్ణారెడ్డి, మద్దూకూరి రాంబాబు, ఓబీసీ నాయకులు జంగయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.