జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్ని విధాల రైతులను ఆదుకుంటాం – నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.
గత వైకాపా నాయకుల అవినీతిని కక్కిస్తా – సొసైటీ చైర్మన్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగ అభ్యున్నతిని అగ్ర ప్రాధాన్యంగా తీసుకొని,రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను వేగవంతం చేస్తుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.శుక్రవారం నాడు నందలూరు మండలం నందు పర్యటిస్తూ ముందుగా నందలూరు సొసైటీ చైర్మన్ ప్రవీణ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ మరియు డైరెక్టర్లు మాసపల్లె రమణ మరియు శివారెడ్డి చే నూతన ప్రమాణస్వీకారం చమర్తి జగన్ మోహన్ రాజుచేయించారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ సహకార సంఘాలు,రైతుల బలానికి పునాదులని,వాటిని మరింత బలోపేతం చేసి ప్రతి రైతు కుటుంబంలో సుసంపన్నత చేకూరేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను వినిపించు కోవడమే,కాకుండా వాటికి తక్షణం పరిష్కారం చూపే సమర్థత,నిజాయితీ పక్షపాతం,ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో మూల సూత్రాలు ఈ అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకెళ్తా మన్నారు.అదేవిధంగా చమర్తి సారధ్యంలో బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు,బలిజ సామాజిక వర్గానికి చెందిన వారినే మండల పార్టీ అధ్యక్షులు,సొసైటీ చైర్మన్లు,క్లస్టర్ ఇన్చార్జ్లును నియమించినందుకు పార్టీ క్యాడర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా నూతన చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో సోసైటీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అనేక ఆక్రమాలు చేశారని వైకాపా నాయకులు చేసిన అవినీతి అక్రమాలన్నీ వెలికి తీసి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతానని నాపై నమ్మకం వుంచి అవకాశం కల్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్ మోహన్ రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో చమర్తి జగన్ మోహన్ రాజు కి ఘన స్వాగతం పలికారు.అనంతరం వారు చమర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీముఖ్యనాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



