Listen to this article

గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్ జనవరి 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణి లో వున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. పెన్షన్ పంపిణీలో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడడం పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా టెంట్ త్రాగు నీరు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన సర్పంచ్ బండి ప్రవీణ్, అలాగే గ్రామ అభివృద్ధికి కావలసిన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, ప్రభుత్వ అధికారులు ప్రజలు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.