జనం న్యూస్ జనవరి 2 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బీర్పూర్ బహిరంగ వేళములు నిర్వహించడం జరిగింది. ఇట్టి బహిరంగ వేలం పాటలలో 1) కొబ్బరికాయలు బెల్లం అమ్ముకొని హక్కు గురించి రూ. 2,60,000-00, 2) లడ్డు పులిహోర అమ్ముకోను హక్కు రూ. 4,13,000-00, 3) పట్టేనామాలు మాలు కోరమీసాలు అమ్ముకునే హక్కు గురించి రూ. 2,90,000-00, 4) గండ దీపం నూనె అమ్ముకొను హక్కు గురించి రూ. 2,70,000-00, 5) కొబ్బరి ముక్కలు ప్రొగు చేసుకోను హక్కు గురించి రూ.50,000-00, 6) తలనీలాలు ప్రోగు చేసుకునే హక్కు గురించి రూ. 11,500-00 మొత్తం రూ. 12,94,500-00 దేవాలయం కు ఆదాయం సమకూరినది. గత సంవత్సరం రూ.11,88,000 వేల రూపాయలు రాగా ఈ సంవత్సరం రూ. 1,06,500-00 లు అదనంగా ఆదాయం సమకూరినది. ఈ కార్యక్రమం దేవాలయ కార్యనిర్వహణాధికారి గారి అధ్యక్షతన , రేనవేషన్ కమిటీ సభ్యులు & గ్రామ మండల ప్రజా ప్రతినిధులు మరియు భక్తుల సమక్షంలో నిర్వహించగా, బీర్పూర్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది, దేవాలయ అర్చకులు & సిబ్బంది పాల్గొనడం తదితరులు పాల్గొన్నారు



