Listen to this article

జనం న్యూస్ జనవరి రెండు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

పర్యటనను విజయవంతం చేయాలి.

బీజేపీ మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి పిలుపు.

మార్కాపురం జిల్లా :

మార్కాపురం జిల్లాకు వరప్రదాయినిగా నిలిచిన వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 7న మార్కాపురం జిల్లాకు వస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనను ప్రజలంతా కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు. దశాబ్దాలుగా ప్రజల కలగా నిలిచిన మార్కాపురం జిల్లా ఏర్పాటును సాకారం చేసిన విజనరీ నాయకుడు, అభివృద్ధి నిర్మాత చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, నిర్వాసితులకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటి పట్టాలు, పునరావాస–పునర్నిర్మాణ (R&R) ప్యాకేజీ అందజేస్తే ప్రాజెక్టు పూర్తి అయినట్టేనని ఆయన తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు తొలిసారిగా శంకుస్థాపన చేసిన నాయకుడు కూడా చంద్రబాబేనని డాక్టర్ ఏలూరి గుర్తు చేశారు. త్వరలోనే ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేయబడుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెలిగొండ పూర్తయితే మార్కాపురం జిల్లా సస్యశ్యామలంగా మారి, రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే మార్కాపురాన్ని జిల్లాగా రూపొందించిన చంద్రబాబు, వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో పెద్దఎత్తున కేంద్ర విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పడి, మార్కాపురం జిల్లా ఘననీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సమగ్ర అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కీలకమని, అందుకే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.