జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జేయన్ టియు గురజాడలో విషాదం నెలకొంది. ట్రిపుల్లో చదువుతున్న విద్యార్థి వెంకట ఉదయ్ తేజ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం టిఫిన్ చేశాక క్లాసులకు వెళ్లకుండా గదికి వెళ్లిన ఉదయ్, మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


