జనం న్యూస్:జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,)
“చదువు ద్వారా సమానత్వం” అన్న నినాదానికి ప్రాణం పోసిన సావిత్రిబాయి ఫూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన ఆమె
బాలికల విద్యకు పునాది వేసిన మహనీయురాలు. స్త్రీ విద్య, సామాజిక,సంస్కరణల కోసం జీవితాన్ని అంకితం చేసిన యోధురాలు,ఆ మహనీయురాలికి వినమ్ర నివాళులు. సావిత్రిబాయి ఫూలే సేవలు ఎప్పటికీ స్మరణీయం. ఆ మహనీయురాలికి వినమ్ర నివాళులు అర్పిద్దాం.


