జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఎస్బిఐ జీవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం లో భాగంగా క్యాంపు నిర్వహణ..గ్రామాలలో ప్రజలకు టీబీ పట్ల అవగాహన పెంచేందుకు దాని నిర్ధారణ కొరకు మొబైల్ ఎక్స్ రే మిషన్స్ తో ఎస్బిఐ జీవనం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం భాగంగా హెల్త్ క్యాంప్ ను పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో నేడు నిర్వహించారు,ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ లు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ క్యాంపు యం యల్ హెచ్ పి డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామంలో దాదాపు 150 మందికి పైగా ఈ క్యాంపులో పాల్గొన్నారు,వీరిలో 114 మందికి ఎక్స్ రే లు,115 మందికి షుగర్(ఆర్ బి యస్ ) బీపి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని మిగతా వారికీ జనరల్ చెకప్ లు నిర్వహించామని టీబీ ఫ్రోగ్రామ్ సూపర్ వైజర్ ముక్తార్, ఎ ఎన్ యం పుష్పలతలు వెల్లడించారు.వ్యాధి నిర్ధారణ ఐన వారికి మందులతోపాటు ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను అందించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ కేతూరి ధర్మతేజ మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ లు మాట్లాడుతూ రోజు రోజుకు పెరిగిపోతున్న టీబి వ్యాధి పట్ల అప్రమత్తతతో గ్రామంలో మొబైల్ ఎక్స్ రే తో సహా ప్రజలకు అవగాహన కల్పించి చికిత్స అందించేందుకు కావలసిన పరీక్షలు నిర్వహించినందుకు ఎస్ బి ఐ జీవనం ప్రాజెక్టు సంస్థకు మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు,రాబోయే రోజుల్లో గ్రామంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ లు ప్రభాకర్,దివాకర్,సూఫీ కజీమ్,ఆశవర్కర్లు,ఎక్స్ రే టెక్నీషియన్లు,మరియు గ్రామ ఉపసర్పంచ్ రాముడు,వార్డు మెంబర్లు ఈశ్వరయ్య,దొబ్బలి వెంకటయ్య,నరేష్,సుధాకర్,సీనియర్ నాయకులు కూడెల్లి వెంకట్రాములు,రెడ్డి వెంకటేశ్వర్లు,సత్యం,మండ్ల కురుమయ్య.వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు…_


