జనం న్యూస్: జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,)
పట్టణ మరియు పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సఖీ సురక్ష” (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.నగరాల్లో, పట్టణాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 26.53 లక్షల మహిళలను ఉద్దేశించి వారి ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన కొత్త పధకమే “సఖీ సురక్ష”.తొలి దశలో లక్ష మందికి వైద్య పరీక్షలు,అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించే ప్రయత్నం.గత నెలరోజుల్లో వైద్య శిబిరాలు నిర్వహించి 76 వేల మందికి పైగా వైద్య పరీక్షలు.వీరికి అండగా హెల్త్ రిసోర్స్ పర్సెన్స్ అత్యధిక మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తింపు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారా కూడ వైద్యం అందజేత.


