Listen to this article

జనం న్యూస్, జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో విద్య అనేది జీవితంలో ఒక భాగం కావాలి గురువులను గౌరవించడం గురువులను తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఒక లక్షణంగా అలవర్చుకోవాలి అంతే తప్ప వినోదం స్నేహితులు పేరిట తల్లిదండ్రులను చూసే బాధ్యతను విద్యార్థులు భవిష్యత్తులో మర్చిపోరాదు. తమ చదువు సమాజానికి ఉపయోగపడాలి అదే వారి జీవిత ధ్యేయం కావాలి మీ జీవితం సమాజానికి మార్గదర్శనం చేయాలి గురువులకు ఎవరు ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకూడదు పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది విద్యార్థులందరికీ అకాడమీ పుస్తకాలతో పాటు ఇతర జ్ఞానాన్ని ఆశించే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది పుస్తకం వారి నేస్తం కావాలి చదవడం వినటం మాట్లాడటం అనేది పుస్తక పఠనం తో మనకు వస్తుంది బడి అంటే కేవలం చదువు చదువు చెప్పడానికి పరిమితం కాదని విద్యార్థులను గొప్పవాళ్లుగా మలిచే దేవాలయం బడి అని గ్రహించాలి యోగా జ్ఞానం ధ్యానం తదితర అంశాలను ప్రజల్లోకి ముఖ్యంగా విద్యార్థులకు తీసుకెళ్ళేందుకు తన త్వరలో ఉచిత సంచార ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జగన్ గురూజీ తెలిపారు శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగిన గ్రాండ్ పేరెంట్స్ డే మరియు హాస్టల్ పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థుల యొక్క అమ్మమ్మ తాతయ్యలను నాయనమ్మ తాతయ్యలను సన్మానించి వారిచే ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగన్ గురూజీ వచ్చి సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్ ప్రిన్సిపాల్ దంపతులు చక్రవర్తి మేనేజర్ దంపతులు పాల్గొన్నారు