జనం న్యూస్, జనవరి 03,అచ్యుతాపురం:
ఈరోజు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్,విఎంఆర్డీఏ
చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ తో కలిసి రాంబిల్లి మండలం లోని హరిపురం,పంచదార్ల మరియు మునగపాక మండలంలోని చెర్లోపాలెం గ్రామాల్లో అభివృద్ధికి అవకాశం ఉన్న భూములను పరిశీలించారు. తదుపరి అసంపూర్తిగా మిగిలి ఉన్న చౌడువాడ ఎంఐజి
లేఔట్ నందు పనులను పరిశీలించి సత్వరమే అన్నివిధాలుగా పూర్తి చేసి లేఅవుట్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మరియు కమిషనర్ తేజ్ భరత్ ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజనీర్ భవానీ శంకర్, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన ప్రణాళికాధికారిణి శిల్పా, కార్యనిర్వహక ఇంజనీర్ రాంబాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



