జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిభాయి ఫూలే గారి 195వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కాపేటలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మొట్టమొదట శ్రీమతి సావిత్రి భాయి ఫూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. తరువాత పాఠశాల నందలి మహిళ ఉపాధ్యాయులు విజయ మరియు సంగీత లను శాలువలతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా చిలిప్చేడ్ మండల విద్యాధికారి విట్టల్ మాట్లాడుతూ సావిత్రిభాయి ఫూలే మహిళలకు విద్య అనేది నిషేధంగా భావించబడిన సమయంలో, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ప్రోత్సాహంతో చదువుకుని, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచారని, 1848లో పూణెలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించడం ఆమె జీవితంలోని గొప్ప మైలురాయని, మహిళల విద్యకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా, బాల్యవివాహాల నిర్మూలనకు, సామాజిక సమానత్వానికి ఆమె నిరంతరం కృషి చేశారని ఆమె కేవలం ఉాధ్యాయురాలు మాత్రమే కాదని, సామాజిక సంస్కర్త, కవి, మానవతావాది కూడా. “కవితా ఫూలే” వంటి రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశారని, ప్లేగ్ వంటి విపత్తుల సమయంలో రోగులకు సేవ చేస్తూ 1897లో ప్రాణత్యాగం చేశారని, “విద్యే నిజమైన విముక్తి మార్గం” ఆమె మనకు నేర్పిన సందేశం అని, ఆమె ఆశయాలను మన జీవితాల్లో అమలు చేస్తూ, విద్య ద్వారా సమాజాన్ని మార్చే బాధ్యత మనందరిదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ కుమార్, యాదగౌడ్, మోహన్, మహేష్ కుమార్, విష్ణువర్ధన్ మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


