Listen to this article

జనం న్యూస్ జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు జన్మ నక్షత్రం ఈరోజు శివముక్కోటి మరియు పౌర్ణమి మహా పర్వదిన శుభ సందర్భంగా స్వయంభు శ్రీ భోగ లింగేశ్వర స్వామికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. లోక సంరక్షణార్థం సర్వజనుల ఆయుష్ ఆరోగ్యం శ్రేయస్సు కొరకు శాంతి సౌభాగ్య సిద్ధ్యర్ధం తెల్లవారుజాము నుండి ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఆధో పూజోగణాధిప అన్నట్టుగా గణపతి పూజా పంచగవ్యం సర్వతోభద్ర మండల రుద్ర మండపార్చన తదనంతరం మహాన్యాసము మరియు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకo మరియు ముఖ్యంగా అన్నాభిషేకము నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పేరూరి చిన్ని స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారని, ఈ కార్యక్రమానికి వేద పండితులు శ్రీ కొత్తలంక పల్లంరాజు శర్మ, చాడ శేష్ కుమార్, నాగేంద్ర శర్మ, సాయి సందీప్,సాత్విక్ శర్మ అన్నాభిషేకం ఎంతో వైభవోపేతంగా జరిపించారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్ రావు పాల్గొని చిన్ని స్వామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మరియు ధర్మకర్తలు మద్దాల నారాయణరావు, మల్ల సూరిబాబు, రాపేటి నాగ సంతోష్, ఎలమంచిలి బంగార్రాజు, కొట్రా హరి, బాదంపూడి కొండమ్మ,కార్య నిర్వహణ అధికారి మురళీకృష్ణ దేవస్థాన సిబ్బంది మళ్ళ రామ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. భక్తుల సహాయ సహకారములతో ఈ పూజా కార్యక్రమం జరగడం విశేషమైనదని, భక్తులు యావన్మంది స్వామివారిని దర్శించి సుమారు 1500 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.//