Listen to this article

జనం న్యూస్‌ 04 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ గా ఎ. తిరుపతి రావు, డిస్ట్రిక్ట్ 102 కేబినెట్ కార్యదర్శి గా త్యాడ రామకృష్ణారావు (బాలు) ప్రమాణస్వీకారం..వాకర్స్ ఇంటర్నేషనల్ 2026 గవర్నర్ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం తోషినివాల్ భవనంలో డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.కార్యక్రమంలో భాగంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ పి. రవిరాజు హాజరై 2026,డిస్ట్రిక్ట్ 102 కార్యవర్గాన్ని ప్రమాణస్వీకారం చేయించారు..డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ గా ఎ. తిరుపతి రావు, కేబినెట్ సెక్రటరీ గా సామాజిక కార్యకర్త త్యాడ రామకృష్ణారావు(బాలు), బులిటెన్ ఎడిటర్ ఎ. ఎస్. ప్రకాశరావు, జాలీ వాకర్ గా సి.హెచ్.రమణ, కోశాధికారి గా ఆర్.సి.హెచ్. అప్పలనాయుడు, డిస్ట్రిక్ట్ 102 పరిధిలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న గవర్నర్ కార్యవర్గంమైన డిప్యుటీ గవర్నర్స్, జోన్ చైర్ పర్సన్, డైరెక్టర్స్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్, పి.ఆర్.ఓస్ మొదలగు నడక సభ్యులు ఇంటర్నేషనల్ వాకర్స్ అధ్యక్షులు పి. రవిరాజు ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్బంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పి. రవిరాజు మాట్లాడుతూ వాకర్స్ క్లబ్బులు సమాజానికి పట్టుకొమ్మలని, ఆరోగ్యం కోసం పాటుపడటంతోపాటుగా సమాజసేవలో వాకర్స్ క్లబ్బులు ముందుంటాయని,మానవడు సంఘజీవని., ఒక్కడు కాకుండా నడకసంఘంలో సభ్యులుగా చేరితే అందరితో పాటు మరింత సేవ చేసే భాగ్యం కలుకుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యం మని, ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా అని, అందుకే నడక ఉద్యమానికి ప్రతీఒక్కరు పాటుపడాలని సూచించారు..నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఆరిగతోట తిరుపతి రావు మాట్లాడుతూ వాకర్స్ క్లబ్బుల అభివృద్ధికి మరింత కృషిచేస్తానని, కొత్త క్లబ్బల ఏర్పాటుకు, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహనపెంచుటకు, వాకర్స్ ఉద్యమానికి మరింత కృషి చేస్తానని అన్నారు.కార్యక్రమంలో వాకర్స్ ఉద్యమానికి పాటుపడుతున్న అతిధులైన ఇండుపూరు గున్నేశ్వరరావు, కె. మురళీధర్, పీ.జీ. గుప్తా, జామి నారాయణ స్వామి,నాలుగెస్సలు రాజు,సుబ్బరాజు, త్యాడ చిరంజీవి రావు, ఇందిరాప్రసాద్, కర్రోతు సత్యం, పిన్నింటి సూర్యనారాయణ, కె. ఎర్నాయుడు, గుడ్ల సత్యనారాయణ, కె. వి. రమణమూర్తి తదితర పెద్దలు భారీగా హాజరయ్యారు