జనంన్యూస్ 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరికొండ ముద్దుబిడ్డ తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బిన్ హమ్దాన్ ను గ్రామ సర్పంచ్ సాయి చరణ్. పాలక వర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరికొండకు మంజూరైన ఐటీఐ కళాశాల ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దని మన సిరికొండ మండలంలోని ఏర్పాటు అయ్యే విధంగా చూడాలని ఇక్కడున్న వసతులను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు అలాగే సిరికొండ లో గ్రంథాలయం (లైబ్రరీ) సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టాలని తమ ద్వారా నిధులు మంజూరయ్యే విధంగా చూడాలని మరియు నూతన డ్రైనేజ్ నిర్మాణం గురించి చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శోభన్ , 5వ వార్డు సభ్యులు మురళీ , 7వ వార్డు సభ్యులు రంజిత్ 12వ వార్డు సభ్యులు తిరుపతి, 8వ వార్డు సభ్యులు బొల్గం శివహారిక , 11వ వార్డు సభ్యులు ఇందూరి అమృత , 3వ వార్డు సభ్యులు సుమన్ అశ్విని , VDC చైర్మన్ ఇందూరి స్వామి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి. అన్సార్ తదితరులు పాల్గొన్నారు.



