Listen to this article

జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డి లు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు.పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.పవర్ పాయింట్ ప్రసంటేషన్ లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు.కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారే.
జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి డి పి ఆర్ ప్రకారం తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది.పాలమూరు రైతుల తో ఆట ఆడుతున్నారు.మాయ మాటలతో, మోసం చేసి.. మరో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు.తప్పులను వాళ్ళ పై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ ఆడుతున్న నాటకం.ఇద్దరు ఆడుతున్న నాటకం లో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.పాలమూరు ప్రజలను పదేళ్లు కేసీఆర్ మోసం చేశారనే… ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు.
జూరాల అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదు.డిండి కి నీళ్ళు తీసుకువెళ్ళడంతో పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుంది.పోటీలు పడి పవర్ పాయింట్ ప్రసంటేషన్ ఇస్తున్నారు.. దాని ఔట్ కమ్ ఏంటి..డిండి కి నీళ్ళు తీసుకువెళ్ళడాన్ని గతంలో పార్టీలకు అతీతంగా వ్యతిరేకించడం జరిగింది.జూరాల నీళ్లు తీసుకునే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డి పి ఆర్ టెకప్ చేయండి.ఇంతకు ముందు చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కల్వకుర్తి లో కలిపేయండి.లేదా నాగర్ కర్నూల్, నల్గొండ అని దాని పేరు పెట్టండి..అందులో పాలమూరు, రంగారెడ్డి రెండు లేవు.పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నారు.. డిండి కి నీళ్ళు తీసుకువెళ్తుంటే నోర్లు మూసుకొని,చోద్యం చూస్తున్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎందుకు రివ్యూలు పెట్టడం లేదు..నన్ను పిలవకపోయినా ఒకసారి వెళ్ళడం జరిగింది.
రివ్యూలకు నన్ను ఆహ్వానించడం లేదు. కలసి నిర్ణయం తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి..?వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ఇరిజేషన్ నిపుణులు,అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ పెట్టండి.వచ్చే మూడేళ్లలో అయిన పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసే చొరవ సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలి.