Listen to this article

వక్తృత పోటీలు, మహిళా ఉపాధ్యాయినిలకు సన్మానం

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం: హెచ్‌ఎం ఆర్.కళ్యాణి

జనం న్యూస్ 03 జనవరి మణుగూరు:

సింగరేణి పాఠశాల పీవీ కాలనీ, మణుగూరులో మాత సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు పొందుతున్న గౌరవానికి మూలకారణం మాత సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలు, సేవలేనని పేర్కొన్నారు. మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయురాలిగా ఆమెను కొనియాడారు.పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు వేణు మాట్లాడుతూ, విద్యార్థులు సావిత్రిబాయి పూలే ని ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా చదివి సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు లింగంపల్లి దయానంద్ సమన్వయం చేయగా, మస్తానయ్య, వెంకన్న, శత్రు, భీమయ్య, సుశీల, సరిత, లక్ష్మి, రజిత, కళ్యాణ్, కోటేష్, తహర్ పాషా, బాను, కిరణ్మయి, సురేష్, స్రవంతి, హిమబిందు, సింధుప్రియ, సోనీ వెంకటేష్, రజియా, కృష్ణవేణి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.