Listen to this article

జనం న్యూస్ 4డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్: ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌ దంపతుల 39వ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ… హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌లు ఆదివాసీల ఆత్మ బంధువులుగా వారి హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగాలు, సేవలను నేటి తరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఆదివాసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారి హక్కుల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.ఈనెల 11న జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వర్ధంతి సభకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్లవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ,
కార్యనిర్వాహక సభ్యులు ఆత్రం భగవంత్, గేడం గణపత్, కనక భరత్, తరుణ్,మాధవ్,భీమ్ము, నాయకులు సిడం తిరుపతి, టెకం గంగారాం తదితరులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్