Listen to this article

జనం న్యూస్‌ 05 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ దిగడం చారిత్రక ఘట్టంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2016లోనే అశోక్ గజపతిరాజు అనుమతులు తెచ్చారని.. 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు. ఎయిర్పోర్ట్లో టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, దీంతో ఉత్తరాంధ్ర దిశ, దశ పూర్తిగా మారనున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.