Listen to this article

జనం న్యూస్ 05 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం చేసిన ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉపేర్ నరసింహ, వివి నరసింహ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం వలన నష్టపోయిన ఆటో కార్మికులకు 12000 రూపాయలు ఇస్తామని హమీ ఇచ్చిందని తెలిపారు. హమీ అమలు కోసం ప్రభుత్వం దృష్టి కి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదని అన్నారు. మరో వైపు ఆటో కార్మికులు ఉపాధి లేక వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని కార్మిక సంఘాలు జేఏసీ గా ఏర్పడి ఇచ్చిన హామీని అమలు చేయాలని నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. ఈరోజు జిల్లాలో ఉండవల్లి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఫెడరేషన్ (సిఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు మాషపోగు వెంకటేశ్వర్ ను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన హామిని అమలు చేయాలని కార్మికులు తమ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కార్మికులు చేస్తున్న ప్రయత్నాలు వమ్ము చేయడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రవాణా రంగ కార్మికులు పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలతో అణచివేయడం తగదన్నారు.కార్మిక వర్గ పోరాటాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన రవాణా రంగ నాయకులు,కార్మికులను విడుదల చేయాలని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆటో కార్మికులకు ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేయాలని,12000 చెల్లిస్తు ఉత్తర్వులు జారీ చేయాలని, ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదిశగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో రవాణా రంగ కార్మికులను కలుపుకొని దీర్ఘకాల ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.