

బోగస్ మస్టర్లు…, చేసిన పనికన్న అధనంగా నమోదు
` పనికి వస్తే వారానికి రూ. 100, రాకపోతే రూ. 750 వసూళ్లు
జనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి : కోటబొమ్మాళి మండలంలో ఉపాధి హామీ పథకం అవినీతిమయమైంది. మండల ఉపాధిహామీ ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లుతో క్షేత్రస్థాయి సిబ్బంది కుమక్కై అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మస్టర్లలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పనికి వచ్చే వారి నుంచి రూ.100, రానివారికి మస్టర్ వేసి రూ.750 వసూలు చేస్తున్నారు. కూలీలు చేసిన పనికన్నా ఎక్కువ చూపి వారికి అదనంగా లబ్ధి చేకూరుస్తూ అందులో వారు కొంత మొత్తం మింగేస్తున్నారు. కొన్నిచోట్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న వలసకూలీలకు, ప్రైవేటు ఉద్యోగుల పేరుతో జాబ్‌కార్డులు జారీ చేసి వారు పనులకు హాజరువుతున్నట్లు చూపి జేబులు నింపుకుంటున్నారు. ఇక కుటుంబంలోని కొందరు పనికి వచ్చి కొందరు రాకపోతే రాని వారికి కూడా మస్టర్ వేసి వారి నుంచి రూ.500 వసూలు చేస్తుండగా అసలు గ్రామాల్లో లేనివారికి కొందరికి మస్టర్లు వేసి అలాంటి వారి నుంచి పడిన కూలీలో సగం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి వారం కోట్లాది రూపాయలు బొక్కేస్తున్నారు. అందులో స్థానికంగా పెత్తనం చేసే అధిక