Listen to this article

జనం న్యూస్ 05 జనవరి( కొత్తగూడెం నియోజకవర్గం)

భద్రాచలం నుంచి సారపాక వైపు గంజాయి తరలిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కారణంగా వాహనంలో తరలిస్తున్న గంజాయి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, మూడు బ్యాగుల్లో సుమారు 18 కేజీల గంజాయి, అదనంగా విడిగా రెండు కేజీలు తరలిస్తున్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఇద్దరు వ్యక్తులను గుర్తించగా, ఒకరు పరారీలోకి వెళ్లగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయి మూలాలు, సరఫరా మార్గాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ఘటనతో సారపాక పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనగా, మత్తుపదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.