మాజీ ఎమ్మెల్యే సిందే ఆహ్వానించి కండువా కప్పి హృదయపూర్వక స్వాగతం
జుక్కల్ జనవరి 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండెబాల్లూరు గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బి.ఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీగా బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే హాజరై, బి ఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వక స్వాగతం పలికారు.అనంతరం హన్మంత్ షిండే మాట్లాడుతూ—“ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగిన పార్టీ బి ఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. వారి వైఫల్యాలను గమనించిన ప్రజలు బిఆర్ఎస్ ఆకర్షితులవుతున్నారు. ఈ చేరికలు పార్టీ బలాన్ని మరింత పెంచుతాయి” అని అన్నారు.గ్రామ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తూ, కండెబాల్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




