Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 06 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పోలీసు క్వార్టర్సు నిర్మాణంకు గతంలో ప్రభుత్వం మంజూరు చేసినస్ధలంకు రక్షణగా నిర్మించిన కంచెను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 5న ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శించి, ఆకస్మికంగా పూసపాటిరేగ పోలీసు స్టేషను సందర్శించారు. ఇటీవల పోలీసు శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంను సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసి, కంచెను ఏర్పాటు చేసిన స్థలంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ -భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ ఎంతో చొరవతో ప్రభుత్వ స్థలంకు రక్షణగా కంచెను ఏర్పాటు చేసారన్నారు.అంతేకాకుండా, ప్రభుత్వ స్థలంలో గుబురుగా పెరిగిన మొక్కలను, తుప్పలను ట్రాక్టరు, జెసిబి, కూలీలను సహాయంతో
తొలగించారన్నారు.గతంలో ప్రభుత్వం పోలీసు కార్వర్సు నిర్మాణంకు పూసపాటిరేగ పోలీసు స్టేషను సమీపంలో 75 సెంట్లు స్థలంనుమంజూరు చేయగా, సదరు స్ధలం జాతీయ రహదారి నిర్మాణంలో 25 సెంట్లు భూమి పోయిందని జిల్లా ఎస్పీ తెలిపారు.మిగిలిన 50 సెంట్లు స్ధలంకు ఎటువంటి రక్షణ లేక, స్థానికుల ఆక్రమణకు గురవుతున్న తరుణంలో భోగాపురం రూరల్సిఐ జి.రామకృష్ణ చొరవ తీసుకొని, సదరు స్థలంలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో సర్వే చేయించి, హద్దులు ఏర్పాటు చేసి, స్ధలం చుట్టూ కంచెను, గేటును ఏర్పాటు చేసారన్నారు. ప్రభుత్వ స్థలంకు రక్షణగా ఫెన్సింగు ఏర్పాటు చేసిన సిఐరామకృష్ణను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. అనంతరం, పోలీసు స్టేషనులో గతంలో నమోదైన కేసులదర్యాప్తును పరిశీలించి, వాటిలో దర్యాప్తు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బి సిఐ ఏ.వి.లీలారావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, NHA మేనేజర్ రామస్వామి, డెంకాడ ఎస్సై సన్యాసి నాయుడు, పూసపాటి రేగ ఎస్పై ఐ.దుర్గా ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనారు.