జనం న్యూస్ జనవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పరిపాలనా పరమైన పనులు వేగవంతంగా మరియు ఆటంకం లేకుండా సాగడానికి వీలుగా, పరవాడలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అందించిన సహకారం ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) కింద మాన్ కైండ్ ఫార్మా, లూపిన్ ఫార్మా మరియు వసుధ ఫార్మా కంపెనీలు అందించిన సహాయంపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, కొనియాడారు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులలో భాగంగా:మాన్ కైండ్ ఫార్మా: విద్యుత్ అంతరాయం కలగకుండా కార్యాలయానికి అవసరమైన భారీ జనరేటర్ ను అందించారు.లూపిన్ ఫార్మా మరియు వసుధ ఫార్మా కంపెనీలు: కంప్యూటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్ వ్యవస్థను సమకూర్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు ప్రజలకు నిరంతరం సేవలందిస్తుంటారు. పవర్ కట్స్ వల్ల పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ జనరేటర్ మరియు యు పి ఎస్ వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజిక బాధ్యతతో స్పందించి ఈ పరికరాలను అందించిన మాన్ కైండ్ ఫార్మా, లూపిన్ ఫార్మా మరియు వసుధ ఫార్మా యాజమాన్యాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ లు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, మాన్ కైండ్ ఫార్మా ప్రతినిధులు రామలింగం, నరేష్, లూపిన్ ఫార్మా ప్రతినిధులు గంగరాజు, వెంకట్, వసుధ ఫార్మా ప్రతినిధులు రామరాజు, హర్ష, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, మల్లికార్జునరావు, రామకృష్ణారావు, మన్మధరావు, ఎస్సైలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, శిరీష మరియు ఐటీ కోర్ శ్రీధర్ ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.//


