బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు మంగళవారం నాడు తహసిల్దార్ గారి అధ్యక్షతన సూక్ష్మ నీటిపారుదల గణన మరియు నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు, వివిధ సూక్ష్మ నీటి పారుదల వనరులను లెక్కించనున్నట్లు తెలిపారు. వీటిని మొబైల్ యాప్ ద్వారా క్షేత్ర స్థాయికి వెళ్లి నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల లభ్యత గురించి తెలియనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందుకు రైతులందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీ వేణుగోపాల్ , ఏఎస్ఓ దత్తు, ఎన్యుమరెటర్స్ లు పాల్గొన్నారు.




