Listen to this article

బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం హజ్గుల్ జడ్పీహెచ్ఎస్ బాల బాలికలు మంగళవారం రోజు నిజామాబాద్ జిల్లా జడ్పీహెచ్ఎస్ తిరుమన్ పల్లిలో జరిగినటువంటి ఉమ్మడి జిల్లాల ఎస్ జి ఎఫ్-14 ఇయర్స్ బాల బాలికల నెట్ బాల్ గవర్నమెంట్ లో జెడ్ పి హెచ్ ఎస్ హస్గుల్ బాలికల జట్టు తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నయీమ్ పటేల్ బాలికలకు శాలువాతో సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ హప్పే మాధవ్ రావు మరియు పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు డాక్టర్ రాములు మునీర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు