ఝరాసంగంఐకేపీవీవోఏ మొహమ్మద్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 జనవరి
ఝరాసంగం మండల కేంద్రంలో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలు (Village Organization Assistants) తమ సమస్యలపై వరుస ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలకు పైగా గ్రామస్థాయిలో పేదరిక నిర్మూలన, మహిళా సంఘాల బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, తమ సేవలకు సరైన గుర్తింపు, తగిన వేతనాలు, భద్రత, ఉద్యోగ భరోసా లభించడం లేదని వారు పేర్కొన్నారు.గ్రామీణ మహిళా సంఘాలు, వై లుగు గ్రమఖ్య సంగం. లో సంస్థలు, ఐకేపీ కార్యక్రమాలు బలపడేందుకు వీవోఏలు నిత్యం కృషి చేస్తూ కీలక స్తంభాల్లాగా పనిచేస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తమ సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.“అన్ని ప్రభుత్వాలు మా కష్టాన్ని వాడుకోవడమే తప్ప, మా హక్కులు ఇవ్వలేదు. వెట్టి చాకిరిలా పనిచేయించుకుని, చివరకు సమస్యలపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు” అని వీవోఏలు వేదన వ్యక్తం చేశారు. “గత్యంతరం లేక ఉద్యోగాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాం… వసుదేవుడు పోయి గాడిద కాళ్లు పట్టుకున్నట్టే మా పరిస్థితి” అని వారు బాధ వ్యక్తం చేశారు.
వేతనాలు, హక్కులు, భద్రత, ప్రోత్సాహకాలు, ఉద్యోగ భరోసా వంటి ముఖ్య అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమ సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించాలని వీవోఏలు డిమాండ్ చేశారు.


