Listen to this article

జనం న్యూస్‌ 07 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం పట్టణం ప్రధాన రహదారి ప్రజలతో మంగళవారం బిజీబిజీగా కనబడింది. సాధారణంగా పట్టణంలో మంగళవారం మార్కెట్కు సెలవు. సంక్రాంతి పండగకు 8 రోజులు ఉండడంతో మార్కెట్ అంతా తెరిచే ఉంచారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి పండగ షాపింగ్ చేస్తూ నగరంలో బిజీ బిజీగా గడిపారు. ఏ షాపు చూసినా జనాలతో కిక్కిరిసిపోయింది.