Listen to this article

జనం న్యూస్ 06జనవరి (కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసి, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యంగ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి బి. రోహిత్ రాజు ఐపీఎస్‌కు జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.పేద ప్రజలకు ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాల ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బి. రోహిత్ రాజు ఐపీఎస్, తన చురుకైన ఆలోచనలు, సమర్థవంతమైన పరిపాలనా చాకచక్యంతో జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కు పాదంతో చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడుతున్నారని ప్రజలు ప్రశంసిస్తున్నారు.విద్యార్థులు, యువత, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ శాఖను ముందుండి నడిపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీస్ శాఖ సాధించిన విజయాలు రాష్ట్ర స్థాయిలోనూ గుర్తింపు పొందుతున్నాయి.ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ – అతవాలే) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోట శివశంకర్ ఎస్పీ బి. రోహిత్ రాజు ఐపీఎస్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఇదే స్ఫూర్తితో, ఇదే పట్టుదలతో రాబోయే రోజుల్లోనూ గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా అణిచివేసి, శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తూ, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.