Listen to this article

జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 👉 ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ లుకల్పించాలి….జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు.బాసు హనుమంతు నాయుడు
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని బాసు హనుమంతు నాయుడు అన్నారు…. కులగణన సర్వే పై బుధవారం వారు మీడియా కు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని బాసు హనుమంతు నాయుడు వ్యాఖ్యానించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం,చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేయడంతీవ్ర.అభ్యంతరకరమన్నారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని హనుమంతు నాయుడు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని అన్నారు.బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ్, ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఆవేదనవ్యక్తంచేశారు .కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని,ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని,కేబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని బాసు హనుమంతు నాయుడు స్పష్టం చేశారు.