Listen to this article

జనం న్యూస్ – జనవరి 7-నాగార్జునసాగర్ టౌన్ –

నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ జెన్కో హెచ్ ఆర్ డైరెక్టర్ ఎస్ యు కుమార్ రాజు జెన్కో ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం లోని పలు విభాగాలను సందర్శించారు. వీరికి బుద్ధ వనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు బుద్ధవనం బ్రోచర్లతో, బుద్ధవనం కండువాలతో సత్కరించారు. అనంతరం వీరు మహాస్తుపం సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించారు.వీరితోపాటు జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్, జెన్కో అధికారులు రఘురాం, వెంకట సత్య శివకుమార్ తదితరులు ఉన్నారు.