Listen to this article

.హెచ్చరికలు పట్టించుకోని వాహనదారులు

జనం న్యూస్ జనవరి 08 సంగారెడ్డి జిల్లా

పటాన్‌చెరు పట్టణంలో గవర్నమెంట్ ప్రహరీ గోడ పరిధిలో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్ లు కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుపై, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీల వద్ద వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేస్తుండటంతో,నూతనంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో భారీగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.అక్రమ పార్కింగ్‌ను నివారించేందుకు పోలీసులు హెచ్చరిక బోర్డులు, నోటీసులు జారీ చేసినప్పటికీ వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితిపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని అక్రమ పార్కింగ్‌లను తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.