Listen to this article

జనం న్యూస్ జనవరి 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

పండుగ అంటే కొత్త బట్టలు, వంటకాలు మాత్రమే కాదు. జీవితంలో ఆశ వెలిగితే అదే నిజమైన సంక్రాంతి.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి శిరీష సత్తూర్ మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నివసిస్తున్న శివలీల అనే పేదింటి ఆడబిడ్డకు జీవనాధారం కల్పించాలనే ఉద్దేశంతో పూల వ్యాపారం ప్రారంభించేందుకు ఐదు వేల రూపాయల నగదు సహాయం అందజేశారు.ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ,“ప్రతి మహిళ చిన్న వ్యాపారమైనా సరే స్వశక్తితో ప్రారంభించి ముందుకు సాగాలి. ఆర్థిక స్వావలంబనే మహిళకు నిజమైన బలం. మహిళల అభివృద్ధి కోసం అవని స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు.
శివలీల ముఖంలో కనిపించిన ఆనందమే ఈ సహాయానికి అద్దం పడింది. పండుగ రోజున ఒక పేదింటి అమ్మాయికి కొత్త జీవితం ప్రారంభించే అవకాశం కల్పించడం నిజంగా ప్రశంసనీయం.జీవనాధారం ఉంటేనే సంబరం… ఆ సంబరమే పండుగగా మారుతుందన్న మాటకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. అన్నారు