Listen to this article

జనం న్యూస్ జనవరి 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మాడుగులపల్లి మండలం లోని గండ్రవానిగూడెం గ్రామానికి చెందిన కంచర్ల సూర్యనారాయణ రెడ్డి గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచారు.దాతల సహాయం, వైద్యుల కృషి, కుటుంబ సభ్యుల ధైర్యంతో సూర్యనారాయణ రెడ్డి క్రమంగా కోలుకుంటూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా సమాజం నుంచి లభించిన సహాయం ఆయనకు అపారమైన మనోధైర్యాన్ని ఇచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం అందరికీ ఊరట కలిగించే విషయం.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో ఇకపై ఎవరూ డొనేషన్ చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.“ఆరోగ్యానికి మించిన ఆదాయం లేదు.ఆపదలో ఆదుకున్న ఆప్తులను మించిన వారు ఎవ్వరూ లేరు”అనే మాటలు ఈ సంఘటనకు సారాంశంగా నిలుస్తాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ఘటన మానవత్వానికి, ఐక్యతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.