Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 08. 01. 2026

జహీరాబాద్, జనవరి 8: జహీరాబాద్ పద్మశాలి సంఘం 2026 సంవత్సరం కాలమానిని ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక పద్మశాలి భవన్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఈ కాలమానినిని స్థానిక ప్రఖ్యాత వైద్య నిపుణులు పట్నం గిరి, స్థానిక వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బిక్షపతి ఆవిష్కరించారు. కాలమానిని ప్రకారం తిధులు, పండుగలు, స్థానికంగా చేసుకొనే ఉత్సవాలతో రమణీయంగా తీర్చి దిద్దారు. ఈ సందర్బంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ స్థానిక పద్మశాలి సంఘం సంఘటితంగా ఉండి కార్యక్రమాలు జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెజారిటీ కుటుంబాలుగా ఉన్న పద్మశాలీయులు రాజకీయ రంగంలోనూ రాణించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి అభిలషించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ ముఖ్య అతిథులును దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ రమేశ్, కోశాధికారి రంగా అరుణ్ లు పుష్ప గుచ్ఛాలను అందజేశారు. కార్యక్రమానికి కార్యనిర్వాహక సభ్యుడు ఎన్నం రఘు వందన సమర్పణ చేయగా సంఘం ఉపాధ్యక్షులు కనుకుంట్ల నర్సిములు, పగిడిమర్రి రాములు, కొండా శివరాజ్, ముఖ్య సలహాదారులు దోమల పండరి పండాలి ప్రభు, పెగడ శ్రీనివాస్, సగ్గం విజయ్,ఇంజమూరి మల్లేశం, దార మధు, అప్పం శ్రీకాంత్, సగ్గం శ్రీనివాస్, అప్పం శ్రీనివాస్, చిప్ప సత్యనారాయణ, కరదాస్ ప్రేమ్, గుంజిటి విజయ్, సగ్గం చంద్రశేఖర్, గడ్డం పాండులు పాల్గొన్నారు.